నేడు రైతు మహాధర్నా కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్గొండ జిల్లాకు చేరుకున్నారు. రోడ్డు మార్గంలో వెళ్లిన ఆయనకు పార్టీ కేడర్ ఘన స్వాగతం పలికింది. ఈ క్రమంలోనే కేటీఆర్‌ను నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు కలిసి తమ సమస్యలను విన్నివించుకున్నారు.
గొడ్డుకారం పెడుతూ యూనివర్సిటీలో తమను వేధిస్తున్న వైస్ ఛాన్స్‌లర్‌ను తొలగించాలని కేటీఆర్‌ను కలిసి విద్యార్థులు తమ గోడును వెల్లగక్కారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇదిలాఉండగా, మహాత్మా గాంధీ వర్సిటీలో వీసీ ప్రవర్తన వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.వైస్ చాన్సలర్ అల్తాఫ్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారని, ఆయన్ను తొలగించాలని 1000 మంది విద్యార్థులు ఇటీవల వర్సిటీలో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.