థియేటర్లలో మొదలైన సందడి..క్రౌడ్‌ పెరిగినా కనిపించని లాభాలు

-

సందడి మొదలైంది… వంద శాతం సీటింగ్‌ కెపాసిటీకి అనుమతివ్వడంతో సినిమా హాల్స్‌కి పునర్‌వైభవం వచ్చింది. హాల్స్‌.. మాల్స్‌ నిర్వాహకులు సైతం అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటైజేషన్‌.. టెంపరేచర్‌ చెకింగ్‌.. సీట్లకు ఫాగింగ్‌తోపాటు అన్ని రూల్స్‌ పాటిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన గైడ్‌లైన్స్‌ ప్రకారం… థియేటర్లలో కొత్త నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి.

కరోనా రక్కసి ఎంట్రీతో… దాదాపు ఏడు నెలలు థియేటర్లు మూతపడ్డాయి. అన్‌లాక్‌-5 లో థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి వచ్చింది. అది కూడా 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో. అప్పటికే ఏడు నెలల లాస్‌… దానికితోడు కోవిడ్‌ నిబంధనలు. రూల్స్‌కు అనుగుణంగా సీటింగ్‌ అరేంజ్‌మెంట్లలో మార్పులు… థియేటర్ల రెన్యువేషన్‌.. యాజమాన్యాలకు తలకు మించిన భారంగా మారింది. అప్పట్లో సినిమాలు కూడా లేకపోవడంతో… థియేటర్లను ఖాళీగానే నడిపించారు. 50 శాతం సీటింగ్‌ కెపాసిటీ అని చెప్పినప్పటికీ… 50 మంది కూడా థియేటర్లకు రాలేదు.

 

సంక్రాంతికి ముందు… వరుస సినిమాల రిలీజ్‌లతో థియేటర్లలో సందడి మొదలైంది. సోలో లైఫే సో బెటర్‌తో మొదలుపెట్టి…. వరుసగా క్రాక్‌..రెడ్‌.. మాస్టర్‌.. బంగారు బుల్లోడు.. అల్లుడు అదుర్స్‌.. వంటి బడా హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలవడంతో… సినిమాహాల్స్‌, మాల్స్‌కి క్రౌడ్‌ పెరిగింది. దాదాపు ఏడాది తర్వాత… హాల్స్‌ హౌస్‌ ఫుల్‌ అయ్యాయి.

 

ఒకవైపు పెద్ద హీరోల సినిమాలు ఆడుతున్నా… 50 శాతం సీటింగ్‌ కెపాసిటీ ఉండటంతో… థియేటర్లకు ఆశించినంత లాభాలు రాలేదు. పార్కింగ్‌ ఫీజు లేదు. క్యాంటీన్‌లో మునుపటిలా తినేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు. దీంతో… థియేటర్లు ఓపెన్‌ అయినా నష్టాల్లోనే నడిచాయి. తాజాగా 100 శాతం సీటింగ్‌ కెపాసిటీ అనుమతులు లభించాయి. దీనికి తగ్గట్టుగా థియేటర్‌ యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. సానిటైజర్లు, ఫిజికల్‌ డిస్టేన్స్‌, షోకి.. షోకి మధ్య గ్యాప్‌ టైమ్‌లో హాల్‌ ని క్లీన్‌ చేయడంతోపాటు.. సీట్లను శానిటైజ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version