ఆంధ్ర ప్రదేశ్ లో 2024 లో జరగనున్న ఎన్నికల గురించి ఇప్పుడు రాష్ట్రము అంతటా చర్చలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీనే గెలుస్తుందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. కాగా తాజాగా నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము ఏ పార్టీకి లేదని… ఎవరు ఎన్ని వ్యూహాలు చేసినా వచ్చే ఎన్నికల్లోనూ గెలిచేది వైసీపీ అని ఖరాఖండీగా చెప్పేశాడు. ఆదాల మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మరొక పార్టీ అడ్రెస్స్ లేకుండా పోనుందని చెప్పాడు, చంద్రబాబు నాయుడు సారధ్యం వహిస్తున్న టీడీపీ 2024 లోనూ ఓడిపోయి జలసమాధి అవ్వడం ఖాయం అంటూ కామెంట్ చేశాడు. జగన్ తనదైన సంక్షేమ పథకాలతో.. మునుపెన్నడూ ఈ స్థాయిలో ప్రజల కోసమే ఆలోచించే నాయకుడు రాలేదని.. అందుకే సీఎం జగన్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నాడు.
2024 ఎన్నికల్లో టీడీపీ సమాధి అవ్వడం ఖాయం : వైసీపీ ఎంపీ ఆదాల
-