వ్యవసాయాన్ని నేలపై, టెర్రస్‌పై చేయడం గురించి మీరు వినే ఉంటారు, కానీ గోడలపై వ్యవసాయం చేయడం గురించి మీరెప్పుడైనా విన్నారా, గోడలపై అంటే ఏదో షోపీస్ మాత్రమే అనుకుంటారేమో.. పెద్ద ఎత్తున గోధుమలు, బియ్యం, కూరగాయాలు అన్నీ గోడలపైనే పండిస్తున్నారు. ఇంతకీ ఈ వెరైటీ వ్యవసాయం ఎక్కడా అనుకుంటున్నారా..?
ఇజ్రాయెల్‌లో గోడలపై వ్యవసాయం చేస్తున్నారు. మారుతున్న జీవనశైలి, పట్టణాలను ఆధునీకరించారు, వ్యవసాయం చేసే అంతే స్థలం కూడా ఉండటం లేదు. టెక్నాలజీ సాయంతో గోడలపై వ్యవసాయ వనరులుగా మార్చేసుకుంది ఆ దేశం. ఇది మెల్లమెల్లగా ప్రపంచమంతటా ఆదరణ పొందుతోంది. చాలా కంపెనీలు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇజ్రాయెల్ కంపెనీ గ్రీన్‌వాల్ వ్యవస్థాపకుడు పయనీర్ గై బర్న్స్ మాట్లాడుతూ.. ఫేస్‌బుక్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఇజ్రాయెల్‌లోని అనేక గోడలపై నిలువు వ్యవసాయానికి సహకరిస్తున్నాయని చెప్పారు.
ఈ పద్ధతిలో మొక్కలను మొదట చిన్న కుండీలలో, చిన్న యూనిట్లలో నాటుతున్నారు. తరువాత వాటిని గోడపై ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా మొక్కలు కుండీ లేదా గోడ నుంచి పడకుండా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో చాలా దేశాలు ఇలాంటి వ్యవసాయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పండించే పంటలకు సీజన్‌తో సంబంధం లేదు. ఏడాది పొడవునా ఏది కావాలంటే అది పండించుకోవచ్చు. 2019 నుంచే ఇజ్రాయిల్ ఈ కొత్త ఆలోచనకు నాంది పలికింది. ఉక్రెయిన్‌లో కూడా ఈ వర్టికల్ వ్యవసాయం బాగా జనాధారణ పొందుతుంది. పార్కింగ్ ప్లస్‌లు, షాపింగ్ మాల్స్ గోడలపై ఎక్కడపడితే అక్కడ టెక్నాలజీ సాయంతో వర్టికల్ వ్యవసాయం చేస్తున్నారు. పైగా సాధారణ వ్యవసాయం కంటే ఈ వర్టికల్ వ్యవసాయం చేసేందుకు అయ్యే ఖర్చు తక్కువ. 90 శాతం నీటిని ఆదా చేయొచ్చట.
ఇప్పుడు ఇజ్రాయెల్‌లో రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, హోటళ్లు ఇలా అందరూ ఈ వర్టికల్ వ్యవసాయం వైపే దుృష్టిపెడుతున్నారు. వారికి కావాల్సిన ఉత్పత్తులను వారే సొంతంగా తయారుచేసుకుంటున్నారు. మోడ్రన్ ప్రాబ్లమ్స్‌కు మోడ్రన్ సొల్యూషన్ అంటే ఇదేనేమో కదా..!