మణిపూర్ లో శాంతికోసం అఖిలపక్షం భేటీ…

-

గత రెండు నెలలుగా ఒక చట్టం మణిపూర్ రాష్ట్ర ప్రజల మనోభావాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అప్పటి నుండి ఆ రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక ఘటనలు, తిరుగుబాటు వైఖరిని దేశమంతా తిలకించింది. అప్పటిలా కాకున్నా ఇప్పుడు కొంత వరకు హింస జరుగుతూ ఉంది. ఈ హింసపై హుటాహుటిన ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్షము మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో కేంద్రమంత్రి అమిత్ షా, జెపి నడ్డా, వైసీపీ తరపున బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, BRS నుండి వినోద్ కుమార్, శివసేన తరపున ప్రియాంక చతుర్వేది , ఆర్జేడీ నుండి మనోజ్ కుమార్ ఝా , తృణమూల్ కాంగ్రెస్ నుండి డెరెక్ ఒబ్రియాన్ మరియు మేఘాలయ సీఎం సంగ్మా పాల్గొనడం జరిగింది.

ఈ మీటింగ్ లో వీరందరూ కలిసి మణిపూర్ లో హింసను ఆపడానికి ఏ విధమైన చర్యలను తీసుకోవాలి అన్న దానిపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version