ఎంపీ కనిమొళికి ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం..!

-

డీఎంకే ఎంపీ కనిమొళికి ఆదివారం ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. తాను భారతీయురాలినా, కాదా…? అని ఓ సీఐఎస్​ఎఫ్​ అధికారి తనను ప్రశ్నించినట్లు ఆమె వెల్లడించారు. తనకు హిందీ రాదని, తమిళం లేదా అంగ్ల భాషలో మాట్లాడమని అభ్యర్థించగా ఆ మహిళా అధికారి తనను ఈ ప్రశ్న అడిగినట్టు తెలిపారు.

kanimoli

నాకు హిందీ రాకపోవడం వల్ల తమిళం, ఆంగ్లంలో మట్లాడమని కోరానాని తెలిపారు. అందుకు ఆ అధికారి అసలు ‘మీరు భారతీయురాలేనా..?’ అని నన్ను ప్రశ్నించారని తెలిపింది. భారతీయత అంటే హిందీ తెలిసి ఉండడం అని ఎప్పటి నుంచి పరిగణిస్తున్నారో తెలుసుకోవాలని ఉందని డీఎంకే నేత కనిమొళి అన్నారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నారనే అర్థం వచ్చే హ్యాష్ ​ట్యాగ్ ​తో ట్విట్టర్ ​లో పోస్ట్ చేశారు కనిమొళి. ఇక ఈ ట్వీట్​ పై కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం స్పందించింది. కనిమొనిళికి ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తూ… ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలపాలని భద్రతా దళం కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version