రెండు తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని… గంటకు 27 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా వాయుగుండం కదులుతున్నదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 300 కి.మీ, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 280 కి.మీ. దూరంలో వాయుగుండం కొనసాగుతోంది.
పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు దగ్గర కారైకాల్ & శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది… ఈ వాయుగుండం కారణంగా…. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షం హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
అలాగే… నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనున్న వాయుగుండం…ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో చలిగాలులతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఇక అటు తిరుపతి లో ఎడతెరిపి లేకుండా కూరుస్తోంది వర్షం. ఈ భారీ వర్షాలకు మధురానగర్ ,జీవకోన,కోర్లగుంట, బస్టాండ్ పరిసరాల ప్రాంతాలు నీట మునిగాయి.