ఏపీ సీఐడీ అధికారులు జారీ చేసిన నోటిసుల పై స్పందించారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఎపి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారని.. ఈ నెల 17 సిఐడి విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. తాను చట్టాలను అనుసరిస్తానని.. గతంలో నన్ను అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారు..నా సిబ్బంది పై నా పై వ్యక్తి గతంగా దాడి చేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు లో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించానని… సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదంతా చూసి ముఖ్యమంత్రి జగన్ ఆనంద పడుతున్నాడని మండిపడ్డారు. ఫిబ్రవరి 5 వరకు సమయం ఇచ్చానని.. 12 ఆఫ్ 2021 కేసులో నాకు నోటీసులు ఇచ్చారన్నారు.. రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజా ద్రోహం పెడతారా… వ్యక్తి గత కక్ష్య లో భాగంగా నాకు నోటీసులు ఇచ్చారని ఫైర్ అయ్యారు.. ముఖ్యమంత్రి జగన్ పేదలకు భూములు ఇస్తున్నట్లు నిన్న బ్రోచర్ విడుదల చేసారు…రీయల్ ఎస్టేట్ చేస్తున్నట్లు నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో జగన్ అన్న ఇల్లులు ఇస్తాడట..రోడ్లు వెయ్యడానికి డబ్బులు ఉండవు కానీ ఇల్లులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రజలందరూ ఆలోచించాలి..ఇది ప్రజలను మరో మోసానికి పాల్పడుతున్న చర్యలు మాత్రమేనని తెలిపారు.