Breaking : లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎంపీ సంతోష్‌ కుమార్‌ పేరు

-

లోక వ్యాప్తంగా ఉన్న భారతీయుల అపార కృషిని నిక్షిప్తం చేసే “లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్” లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు చోటు లభించింది. విద్యా, సాహిత్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సినిమా, వ్యాపారం, రక్షణ, సామాజిక సేవ వంటి రంగాల్లో అనితరసాధ్యమైన భారతీయుల కృషిని, విజయాలను గుర్తించి.. “లిమ్కాబుక్” రికార్డులో వారి పేరును చేరుస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ అవార్డును సామాజిక సేవా విభాగంలో “ఒక గంటలో అత్యధిక మొక్కలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు రికార్డ్స్ లో తన పేరును చేర్చినట్టు లిమ్కాబుక్ రికార్డ్స్ ఎడిటర్ వత్సాల కౌల్ బెనర్జీ తెలియచేశారు. లిమ్కాబుక్ ప్రశంస పత్రాన్ని ఇవ్వాల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  చేతుల మీదుగా జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అందించినట్లు వారు వెల్లడించారు.

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, దుర్గా నగర్ లో 2021 జూలై 4వ తేదిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక చొరవతో ఒక గంట సమయంలో 16,900 వందల మంది భాగస్వామ్యంతో 3,54,900 మొక్కలు నాటినట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ విభాగంలో ఇదే అత్యుత్తమని.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు 21 మొక్కలు నాటినట్లు సంస్థ వివరించింది. సమిష్టి కృషి, సామాజిక స్పృకు ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని కొనియాడింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version