ఎమ్మార్వో అవినీతి రాజకీయ నాయకులకే ఆదర్శం…!

-

కీసర తహశీల్దార్ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. నేడు నిందితుల కస్టడీ పిటీషన్ పై తుది తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్ట్. నలుగురు నిందితులను నాలుగు రోజుల పాటు కస్టడీ కోరిన ఏసీబీ, విచారణకు కస్టడీ ఇవ్వకపోతే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉంది కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళింది. రాంపల్లి దయరా గ్రామంలోని సర్వే నెంబర్ 614 లోని 19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించిన పట్టా పాస్ బుక్ ఇవ్వడం కోసం 2 కోట్లు డిమాండ్ చేసిన తహసీల్దార్ కి రాజకీయ నాయకులతో లింకులు ఉన్నట్టు గుర్తించారు.

ఇందులో భాగంగా కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికాడు తహశీల్దార్. లంచం ఇచ్చిన కోటి 10 లక్షలు ఎక్కడి నుండి తెసుకొచ్చారు అన్న కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. కోటి 10 లక్షల రూపాయల పై సమాచారం ఇవ్వాలని ఇప్పటికే ఐటి శాఖ కు లేఖ రాసింది. నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తుంది. అతని అవినీతి ఇంకా ఉందని ఏసీబీ భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news