బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ తాజాగా టాలీవుడ్ కి డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. ‘సీతారామం’ సినిమాతో సీతగా ట్రెడిషనల్ లుక్స్ తో తెలుగు ఆడియన్స్ ని తన మాయలో పడేసింది మృణాల్ ఠాకూర్.
డెబ్యూ ఘనంగా ఉంది. మృనాల్ నటించిన ‘సీతారామం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
దాంతో తెలుగులో మృణాల్ ఠాకూర్ పాతుకు పోయేలానే కనిపిస్తోంది. క్రేజీ ఆఫర్లు, మృణాల్ చెంతకొస్తున్నాయట. అయితే, ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ హిందీ, బెంగాలీలో కొన్ని సినిమాల్లో నటించింది.