నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నయ్ సూపర్ కింగ్స్ దారుణంగా ఓడిపోయినప్పటికీ.. ఎంఎస్ ధోని చేసిన రన్ అవుడ్ మ్యాచ్ కే హైలేట్ గా నిలిచింది. ధోని రనౌట్ దెబ్బకు పంజాబ్ బ్యాట్స్‌మెన్ రాజపక్ష నిరాశగా పెవిలియన్ కు వెళ్లాడు. పంజాబ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే ఈ ఘటన చోటు చేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
క్రిస్ జోర్డాన్ వేసిన ఆ ఓవర్ లో తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన రాజపక్స… అదే జోరులో బౌలర్ వేసిన లెంగ్త్ బాల్ ను లెగ్ సైడ్ ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. నాన్ స్ట్రైకర్ లో ఉన్న శిఖర్ ధావన్ సైతం రన్ కోసం మూమెంట్ ఇవ్వగా… రాజపక్స హాఫ్ పిచ్ ధాటేసాడు.
కానీ బంతి బౌలర్ కు సమీపించిందని గ్రహించి.. ధావన్ యూటర్న్ తీసుకోగా.. రాజపక్స సైతం వెనక్కి పరుగెత్తే ప్రయత్నం చేశాడు. అయితే… బంతిని అందుకున్న జోర్డాన్ వికెట్ల వైపు విసరగా.. అది మిస్సై ధోని చేతిలో పడింది. అయితే.. సూపర్ డైవ్ చేసి..బ్యాటర్ ను రనౌట్ చేశాడు ధోని. ఈ రనౌట్ ఒకప్పటి ధోనీని తలపిస్తుండటంతో.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
MS Dhoni's diving run out, a breakdown
(cricket version to a play at the plate, kinda) pic.twitter.com/ByVQdS447b
— Jomboy (@Jomboy_) April 4, 2022