టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ నుంచి తేజస్వి మడివాడ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె హౌజ్ లో ఎదుర్కొన్న పరిస్థితులు, ఆమె ఎలిమినేషన్ కు గల కారణాలు, ఇతర విషయాలపై తేజస్విని యాంకర్ రవి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తేజస్వి మడివాడ ‘బిగ్ బాస్ ఓటీటీ తెలుగు’ షోపైన , కంటెస్టెంట్స్ పైన ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తనను ఎలిమినేషన్ కు నామినేట్ చేసిన నటరాజ్ మాస్టర్ పైన తేజస్వి మడివాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యాంకర్ రవి అడిగిన ప్రశ్నలకు తేజస్వి మడివాడ చక చక సమాధానాలిచ్చేసింది. షోలో సంచాలక్ గా వ్యవహరించిన నటరాజ్ మాస్టర్ తనను పట్టించుకోలేదని తనపై కక్ష కట్టాడన్నట్లు తేజస్వి పేర్కొంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫొటోలకు ఏయే వెజిటేబుల్ నేమ్స్ సజెస్ట్ చేస్తావని తేజస్విని రవి అడిగాడు.
హీరో , మిర్చి, కాకర కాయ.. ఇలా రకరకాల ట్యాగ్ లైన్స్ ను కంటెస్టెంట్స్ కు ఇచ్చేసింది తేజస్వి. ఈ క్రమంలోనే అనిల్ ‘కేటుగాడు’ అని తెలిపింది. నటరాజు మాస్టర్ ను కాటరాజు నటరాజు అని సంబోధించింది. మహేశ్, అఖిల్ షోలో ఇంకా ముందుకు వెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది తేజస్వి. ఈ పూర్తి ఇంటర్వ్యూలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. మొత్తంగా ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షో నుంచి బయటకు వచ్చిన తేజస్వి మళ్లీ నార్మల్ లైఫ్ షురూ చేసిందని చెప్పొచ్చు.