టాలీవుడ్ హీరో నితిన్ కు MS ధోనీ స్పెషల్ గిఫ్ట్

-

హీరో నితిన్ రెడ్డి హిట్ చూసి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో భీష్మతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలు వచ్చినట్టే వెళ్లిపోయాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మాచర్ల నియోజకవర్గం కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం ఈ హీరో ఆశలన్నీ వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రీలీలతో కలిసి నటిస్తున్న సినిమాపైనే ఉన్నాయి.

MS Dhoni special gift to Tollywood hero Nitin

ఈ సినిమానే ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. అయితే, హీరో నితిన్ కొత్త సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వచ్చేనెల 8న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ టీం కి విషెస్ తెలియజేస్తూ కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోని స్పెషల్ గిఫ్ట్ ను పంపించారు. ఈ విషయాన్ని నితిన్ ట్విట్టర్(X)లో వెల్లడించారు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నుంచి ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘బెస్ట్ విషెస్ నితిన్’ అని సంతకం చేసిన టీ షర్టును చూపించగా… ఈ ఫోటో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news