80 శాతం పెరిగిన పీవీఆర్, ఐనాక్స్ సంస్థల షేర్లు..!

-

కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశంలోని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ లు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి కష్ట కాలంలో కూడా మల్టీప్లెక్స్‌ దిగ్గజ సంస్థలు పీవీఆర్‌ లిమిటెడ్, ఐనాక్స్‌ ల షేర్ల విలువ 80 శాతం వరకు పెరిగింది. మూడు నెలల కాలంలో ఈ సంస్థల షేర్ల విలువ దాదాపు 80 శాతం పెరిగింది. అయితే ఇతర మార్కెట్ల ప్రభావం వల్లే తమ షేర్లు పెరిగాయని, అనేక దేశాల్లో సినిమా థియేటర్లు తెరవడం వల్ల తమకు లాభం చేకూరిందని సంస్థల యాజమాన్యాలు పేర్కొన్నాయి.

కాగా, ఇకపై షూటింగులు చేసుకోవొచ్చ‌ని కేంద్రం ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే షూటింగ్ స్పాట్ లో ధ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ త‌ప్ప‌ని స‌రి అని, క‌రోనా ల‌క్ష‌ణాలు లేని వాళ్‌ల‌ని మాత్ర‌మే షూటింగుల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్ ని విధిగా అంద‌రూ డౌన్ లోడ్ చేసుకోవాల‌ని సూచించింది.

ఇకపోతే తెలంగాణ పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఇవాళ టాలీవుడ్ సినీ పెద్దలతో భేటీ అయ్యారు. అనతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరణల కోసం నిర్మాతలు ముందుకొచ్చారని తెలిపారు. టూరిజం ప్రదేశాల్లో షూటింగులపై వారంలోగా ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version