డ్రగ్స్ కలకలం తెలుగు చిత్రసీమను పట్టి పీడిస్తుంది. ఈ కేసులో పలువురు సెలబ్రెటీలకు ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసులో ప్రముఖ హస్తముండటంతో ఈడీ సీరియస్‌గా ఉండటంతో విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సెలబ్రేటీలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులను ఈడీ ప్రశ్నించింది.
ఈ కేసులో తొలుత టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ, నవదీప్, రానా దగ్గుబాటి, నందులను ఇప్పటికే ఈడీ విచారించింది. తాజాగా నేడు నటి ముమైత్ ఖాన్‌ను కూడా విచారించారు. ఆమె బుధవారం ఉదయం 10. 30 నిమిషాలకు ఈడీ ముందు హాజరు కాగా.. కాసేపటి క్రితమే విచారణ ముగిసినట్టు తెలుస్తుంది. దాదాపు ఏడు గంటలపాటు ముమైత్ ఖాన్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. ఈ విచారణలో ముమైత్ బ్యాంకు ఖాతాలను, ఆమె గత నాలుగేండ్లుగా జరిపిన లావాదేవిలను కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది.
ఇదే సమయంలో ఎఫ్ లాంజ్ క్లబ్‌తో ముమైత్ జరిపిన లావాదేవీలపై ఆరా తీసినట్టు సమాచారం. డ్రగ్స్ మాఫియాలో ప్రధాన నిందితుడు, డ్రగ్స్ విక్రేత కెల్విన్ ఈడీ కస్టడీలో ఉన్నాడు. అతను ఇచ్చిన డేటా మేరకు ఈడీ విచారణ చేస్తుంది. ఈ విచారణలో కెల్విన్, జిషాన్‌లతో ముమైత్ ఖాన్‌కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాల్సి ఈడీ ఆదేశించినట్టు సమాచారం. ఇదే కేసులో గత నాలుగేండ్ల క్రితం ముమైత్‌ను దాదాపు పది గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే.. మళ్లీ విచారణకు రావాలని ఆదేశించడంతో పలు అనుమానులు వ్యక్తమవుతున్నాయి.