కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో జనాలకు ఇంట్లో ఏ విధంగా ఉండాలో అర్ధం కావడం లేదు. కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరిగిన జనం… ఇప్పుడు ఇంట్లో ఎం చెయ్యాలో తెలియాక జుట్టు పీక్కునే పరిస్థితి ఏర్పడింది. రెడ్ జోన్ ఏరియా లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం ఇంటి నుంచి అడుగు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఇంటి నుంచి బయట అడుగు పెడితే ఎంత ప్రమాదకరమో ముంబై పోలీసులు చెప్పారు.
అది కూడా పబ్ జి గేమ్ సహాయంతో చెప్పారు. ముంబై పోలీసులు కరోనావైరస్ వ్యాప్తిని రెడ్ జోన్ (ఆటలో సంభవించే తాత్కాలిక ప్రమాద జోన్) తో పోల్చారు. ఒక ఆటగాడు రెడ్ జోన్లో చిక్కుకుంటే, ఇంటి లోపల ఉండటం మాత్రమే సురక్షితంగా ఉండటానికి మార్గం. ప్రస్తుతానికి ప్రపంచం అనుభవిస్తున్న పరిస్థితులతో దానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇంటి నుండి బయటికి రావడం అంటే రెడ్ జోన్ కి వెళ్ళినట్టే.
దీనిలో ప్రమాదం నుండి తప్పించుకోవడానికి గానూ ఆటగాడు ఇంట్లోనే ఉంటాడు. ఎటు వెళ్ళినా సరే బాంబులు పేలుతూనే ఉంటాయి. ప్రతి క్రీడాకారుడికి తెలుసు రెడ్ జోన్లో ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ ఇంట్లో ఉండండి! అని వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ప్రతీ ఒక్కరు వీడియో ని వాట్సాప్ స్టేటస్ గా పోస్ట్ చేస్తున్నారు.
Every player knows – when in a red zone, always stay at home! #GamingLessons #Safety101 #TakingOnCorona pic.twitter.com/rHyqnrqDs2
— Mumbai Police (@MumbaiPolice) April 20, 2020