ఇలాంటివి చూస్తే డెలివరీ లు కూడా ఆపేసేలా ఉన్నారు ! 

-

ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా వైరస్ రావడంతో పాటు అతని వల్ల దాదాపు అరవై తొమ్మిది మందికి సోకినా వార్త మనకందరికీ తెలిసిందే. దీంతో చాలామంది ఫుడ్ ఆర్డర్ లు, డెలివరీలు కూడా ఆపేయటం జరిగింది. మెట్రో సిటీ లో బాగా ధనవంతులు ఉండటంతో ఇళ్ళలోనూ ఉంటున్న తరుణంలో బాగా ఆర్డర్లు జరుగుతున్నాయట. ఇటువంటి నేపథ్యంలో ఢిల్లీ ఘటన గురించి విన్నాక చాలామంది ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం మానేశారు.ఇలాంటి ఘటన ఇటీవల హైదరాబాదులో ఒకటి చోటు చేసుకుంది. స్విగ్గి డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇటీవల ఒక వార్త బయటపడింది. దాదాపు కొన్ని వందల డెలివరీలు ఈ బాయ్ చేసినట్లు చాలా రెస్టారెంట్లలో ఆర్డర్లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వాటి వివరాలను తెలుసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. తాజాగా ఈ వార్త బయటపడటంతో హైదరాబాద్ వాసులు అంతా బిక్కుబిక్కుమంటూ భయంతో ఉన్నారు.

 

అతగాడు ఎవరికీ కరోనా వైరస్ అంటించాడో అన్న దాని విషయంలో కనుక్కోడానికి అధికారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఇప్పుడు డెలివరీ బాయ్స్ నీ కూడా నష్టాల్లోకి నెటుతోంది. లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉన్నా వారికి చేతి నిండా పని మాత్రం లేదు. కరోనా భయంతో రోడ్డెక్కిన ఆన్లైన్ లో ఆర్డర్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. సిటీలలో ఇప్పుడు చాలామంది ఇలాంటి ఘటనలు చూసి డెలివరీలు కూడా ఆపేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ డెలివరీ చేయకూడదని తేల్చిచెప్పేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version