మున్సిపోల్ టెన్షన్; మొదటి రెండు గంటలే కీలకం…!

-

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కి రంగం సిద్దమైంది. 8 గంటల నుంచి ఈ కౌంటింగ్ మొదలుపెట్టారు అధికారులు. మొత్తం పది వేల మంది ఎన్నికల సిబ్బంది ఈ కౌంటింగ్ లో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి బ్యాలెట్ పత్రాలను తర్వాత లెక్కిస్తారు. 120 మున్సిపాలిటీలు 9 కార్పోరేషన్లలో ఈ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.

134 కౌంటింగ్ కేంద్రాల్లో 2,169 టేబుళ్ళను ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసారు. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు సభ్యులు ఉంటారు ఇక ఈ ఎన్నికల బరిలో 12,926 మంది అభ్యర్ధులు నిలిచారు. అటు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బద్రతను ఏర్పాటు చేసారు అధికారులు. 2647 మంది వార్డు మెంబర్లు, 324 మంది కార్పోరేటర్లను ఎన్నుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 80 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

తెరాస పార్టీ 80 మజ్లీస్ మూడు వార్డుల్లో ఏకగ్రీవ౦గా ఎన్నికయ్యాయి. మొదటి రెండు గంటల్లోనే ఫలితాలు ఏంటీ అనేది స్పష్టత వచ్చేస్తుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి ట్రెండ్ తెలిసిపోనుంది. 5 నుంచి 24 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 27 న మేయర్, చైర్మన్ ని ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపికలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఓటు వేయనున్నారు. ఈ ఓట్లు చాలా కీలకం.

Read more RELATED
Recommended to you

Latest news