ఈ రోజు చార్మినార్ కి వెళ్తున్నారా…? జాగ్రత్త…!

-

ఇన్నాళ్ళు దేశ వ్యాప్తంగా పౌర సత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరిగినా హైదరాబాద్ లో మాత్రం పెద్దగా జరగలేదు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ముస్లింల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించడంతో మైనార్టీలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నగరంలో ఎన్నార్పి గాని caa కి వ్యతిరేకంగా గాని ర్యాలీలు జరగకపోవడంతో ప్రభావం లేదని భావించారు.

అయితే ఇప్పుడు ఈ బిల్లుకి వ్యతిరేకంగా మజ్లీస్ దూకుడు పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని మజ్లీస్ భావిస్తుంది. ఈ నేపధ్యంలో శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. దీనితో వేలాది మంది ముస్లింలు అటు మహారాష్ట్ర, కర్నాటక సహా పలు రాష్ట్రాల నుంచి కూడా ముస్లింలు 24 అర్ధరాత్రి జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

అయితే అర్ధరాత్రి షాపింగ్ చార్మినార్ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి అర్ధరాత్రి చార్మినార్ కి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, ఇబ్బందికర పరిస్థితులు ఎదురు అవుతాయని అంటున్నారు. షాపింగ్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఈ రోజు ఆగితే మంచిది అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే పోలీసులు కూడా ఎటు వంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అనేక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news