మీర్జాపూర్ వెబ్ సిరీస్ లోని మున్నాభాయ్ గ్యాంగ్ మెంబ‌ర్ మృతి

-

మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్ లో మున్నాభాయ్ గ్యాంగ్ లో క‌నిపించే ల‌లిత్ మృతి చెందాడు. అత‌ని అస‌లు పేరు బ్ర‌హ్మ. ముంబై లోని వెర్సోవా అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంన్నాడు. అయితే ఈ రోజు న‌టుడు బ్ర‌హ్మ ప్లాట్ లో ఆయ‌న మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో బ్ర‌హ్మ మృత దేహాన్ని ముంబై లోని కూప‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే న‌టుడు బ్ర‌హ్మ మ‌ర‌ణానికి కార‌ణం మాత్రం తెలియాల్సి ఉంది. దీని పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగ న‌టుడు బ్ర‌హ్మ గ‌తం లో చిన్న చిన్న పాత్ర లలో క‌నిపించేవాడు. అయితే ఈ మ‌ధ్య కాలం లో అమెజాన్ ప్రైమ్ లో వ‌చ్చిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా న‌టుడు బ్ర‌హ్మ గుర్తింపు తెచ్చు కున్నాడు. కాగ ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల మీర్జాపూర్ వెబ్ సిరీస్ న‌టీన‌టుల తో పాటు ఆ వెబ్ సిరీస్ అభిమానులు ఆశ్చ‌ర్య పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news