మునుగోడు పోరు: నామినేషన్స్ షురూ..కొత్త ఓట్ల కుట్ర..!

-

తెలంగాణ రాజకీయాలు మొత్తం మునుగోడు చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రాష్ట్ర ప్రజలకు బాగా ఉంది. సాధారణ ఎన్నికల ముందు జరగనున్న ఈ ఉపఎన్నికలో ఏ పార్టీ సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బి‌జే‌పిలు తమ తమ అభ్యర్ధులతో నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశాయి.

ఇదే క్రమంలో తాజాగా మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్ ప్రక్రియ షురూ అయింది..అయితే ప్రధాన పార్టీ అభ్యర్ధులు ఇప్పుడే ముందుగానే నామినేషన్ వేసే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అయిన పాల్వాయి స్రవంతి రెండు సెట్లలో నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 11న ఆమె నామినేషన్ వేయనున్నారు. మళ్ళీ 14న మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 10న నామినేషన్ వేసే ఛాన్స్ ఉంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దాదాపు ఖరారైనట్లు…కాకపోతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక టీఆర్ఎస్ అభ్యర్ధి 13న లేదా 14న నామినేషన్ వేసే ఛాన్స్ ఉంది.

ఇక కే‌ఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరుపున ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేయనున్నారు. అటు బి‌ఎస్‌పి తరుపున నుంచి కూడా అభ్యర్ధి బరిలో దిగనున్నారు. ఇతర పార్టీల నుంచి, ఇండిపెండేట్ అభ్యర్ధులు బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే మునుగోడులో కొత్త ఓట్ల కోసం అర్జీలు ఎక్కువ వచ్చాయి. దాదాపు 23 వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ నెల 4 వరకు అప్ప్లై చేసుకున్న దరఖాస్తులనే ఈసీ పరిశీలించనుంది.

హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ నేతలు మునుగోడులో ఓటు హక్కు కోసం పలువురితో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేయించారని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయగా, అటు బీజేపీ నేతలు కూడా.. ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల దరఖాస్తులకు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యేకంగా ఓ విభాగాన్నే ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి బోగస్ ఓట్లు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ ఫైర్ అవుతుంది. అయినా ఇంత పెద్ద ఎత్తున ఓటు కోసం అప్ప్లై చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి ఎంతమందికి ఈసీ ఓటు హక్కు ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version