తెలంగాణాలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో పార్టీలు అన్నీ జోరును పెంచాయి. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో ఇంకా స్పష్టత లేని చాలా పార్టీలు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పాలి. తాజాగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మాట్లాడుతూ అసీంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థులను 70 మందిని ఎంపిక చేశామన్నారు. ఈ జాబితా సిద్ధంగా ఉందన్నారు, కానీ ఇంకా మిగిలిన అభ్యర్థుల ఎంపికలో చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నామని మురళీధరన్ తెలియచేయడం విశేషం. ఆయా స్థానాలలో గెలుపు అవకాశాలు, విధేయత ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేస్తున్నామన్నారు. త్వరలోనే మిగిలిన అభ్యర్థుల ఎంపికపై చర్చించి పూర్తి జాబితాను ప్రకటిస్తామని మురళీధరన్ స్పష్టం చేశారు. కాగా ఇంకా తెలంగాణ ఎన్నికలలో మాతో కలిసి వచ్చే పార్టీ ల కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు మురళీధరన్.
మరి ఎన్నికలకు ఇంకా కేవలం 45 రోజులే ఉండడంతో ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారు.. వారు ఆయా నియోజకవర్గాలను ఎప్పుడు గ్రిప్ లోకి తెచ్చుకోవాలి.. అసలు ఇదంతా జరిగే పనేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.