దివీస్ ఫ్యాక్టరీ మీద దాడి.. అందరి మీదా మర్డర్ అటెంప్ట్ కేసులు !

-

తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలో ఉన్న తొండంగి మండలలోగల సముద్ర తీరప్రాంత గ్రామాలలో మళ్ళి దివీస్ పార్మాసిటీ కంపినీ ఎర్పాట్లకు ప్రభుత్వం  గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని ప్రచారం జరిగింది ..దీని పై తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన చెలరేగింది. మూడేళ్ళ క్రితం  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ కంపెనీకి బీజం పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీరప్రాంత మత్యకారులు వెతిరేకించారు.   ఈ పార్మా కంపినీ వల్ల ఆరోగ్య ఇబ్బందులు వస్తాయని పిల్లా పాపలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.

వీరికి అండగా  ,ప్రజాసంఘాలు , సిపిఐ, సిపిఎం నాయుకలుతో  కలిసి ఈ కంపినీని  నిలిపివేయాలంటూ అనేక ధర్నాలు,చేసారు . అప్పటి ప్రతిపక్షం వైసీపీ కూడా అందోళన లో పాల్గొంది. కానీ ఇప్పుడు మరో సారి అదే పరిశ్రమ కోసం వైసీపీ సర్కారు హయాంలో నే మళ్ళీ నిర్మాణ పనులు చేసేందుకు అనుమతి ఇవ్వడం పై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న ఆందోళన కారులు ఉన్నపళంగా ఫ్యాక్టరీ స్థలంలో కి చొరబడి విధ్వంసం సృష్టించారు. దీంతో ఈ అందరు ఆందోళనకారుల మీద మర్డర్ అటెంప్ట్ కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఈ కేసులో 160 మీద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో రెండు కోట్ల దాకా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. 36 మందిని ఇప్పటికే రిమాండ్ కు పంపగా మరో 27 మందిని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news