హైద‌రాబాద్ లో దారుణం..తాగిన మ‌త్తులో స్నేహితుడి హ‌త్య‌..!

హైద‌రాబాద్ మంగ‌ళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుఫ్ఫ నగర్ చర్చి లైన్ లో దారుణం చోటు చేసుకుంది. మ‌ద్యం షాపు వద్ద 7గురు స్నేహితులు మ‌ద్యం సేవించారు. అనంత‌రం తాగిన మైకంలో గొడవ పెట్టుకున్నారు. దాంతో మహమద్ హనీఫ్ అనే యువకున్ని ముస్తఫా, రషీద్ క‌లిసి హ‌త‌మార్చారు. ఈ ఘర్షణ ల రషీద్ మ‌రియు ముస్తఫా లకు గాయాలయ్యాయి.

దాంతో వారిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో మరో ముగ్గురు యువకులు ఉన్నారు. మహుమద్ హనీఫ్ మృత దేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి త‌ర‌లించారు.