ఉగ్రవాదులు మా దేశ హీరోలు… పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్…!

ఉగ్రవాదులను తమ దేశ హీరోలుగా పోల్చాడు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్… తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. జమ్మూ కాశ్మీర్‌లో భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కాశ్మీరీలు ముజాహిదీన్‌గా పాకిస్తాన్‌లో శిక్షణ పొందారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. పాకిస్థాన్ నేత ఫర్హతుల్లా బాబర్ బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ముషారఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ వచ్చిన కాశ్మీరీలు ఇక్కడ హీరోలుగా ఘన స్వాగతం అందుకున్నారని, మేము వారికి శిక్షణ ఇచ్చి మద్దతు ఇచ్చే వాళ్లమని వ్యాఖ్యలు చేసాడు.

తాము కాశ్మీరీలను ముజాహిదీన్ గా భావించామని… భారత సైన్యంతో వారు పోరాడతారు అంటూ వ్యాఖ్యానించాడు. 1979 లో, పాకిస్తాన్‌కు ప్రయోజనం చేకూర్చడానికి మరియు సోవియట్‌లను దేశం నుండి బయటకు పంపడానికి గాను… ఆఫ్ఘన్ లో మత ఉగ్రవాదాన్ని ప్రవేశపెట్టినట్టు ముషారఫ్ అంగీకరించాడు. ముజాహిదీన్‌లను ప్రపంచం నలుమూలల నుండి తీసుకువచ్చామన్న ఆయన… వారికి శిక్షణ ఇచ్చి ఆయుధాలు సరఫరా చేసాం అంటూ పేర్కొన్నాడు. తాము తాలిబాన్లకు శిక్షణ ఇచ్చామని ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఇక ఈ సందర్భంగా లాడెన్ సహా పలువురు ఉగ్రవాదులను అతను హీరోలుగా పోల్చాడు. తాలిబాన్లు మా హీరోలని చెప్పిన ముషారఫ్… హక్కానీ మా హీరో. ఒసామా బిన్ లాడెన్ మా హీరో. అమాన్ అల్-జవహిరి మా హీరో.” ఇప్పుడు ప్రపంచ వాతావరణం మారిపోయిందన్న ఆయన ప్రపంచం విషయాలను భిన్నంగా చూడటం ప్రారంభించిందన్నాడు. మన హీరోలు విలన్లుగా మారారని అతను చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం మండిపడుతుంది. ఇక పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని అంగీకరించడానికి ఇంతకంటే ఏం కావాలి అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.