కార్తీక మాసంలో తప్పక ఆచరించాల్సిన విషయాలివే..!

-

కార్తీక మాసంలో పూజలు చేసినా, దీపం వెలిగించినా, నది స్నానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది అయితే కార్తీక మాసంలో ఎటువంటి వాటిని అనుసరిస్తే మంచిది అనే దాని గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూద్దాం.

కార్తీక మాసంలో దీపారాధన చేస్తే పోయిన జన్మలో కలిగిన పాపాలు కూడా తొలగిపోతాయి. అలానే ఈ జన్మకు పాపాలు కూడా పోతాయి. కార్తీక మాసంలో వచ్చే మంగళవారాలు గౌరీ దేవికి పూజ చేస్తే చాలా మంచిది. అలానే కార్తీక మాసంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నియమాలను గనుక పాటిస్తే ఎంతో మంచి కలుగుతుంది.

కార్తీక మాసంలో ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి.
శాఖాహారం మాత్రమే తినాలి.
అదే విధంగా కార్తీకమాసంలో ప్రతి రోజూ దీపం పెడితే చాలా మంచిది. దానధర్మాలు చేస్తే చాలా పుణ్యం వస్తుంది.
ప్రతి రోజూ ఉదయం సాయంత్రం కార్తీక మాసంలో చన్నీటితో స్నానం చేస్తే చాలా మంచిది.
భక్తితో భగవంతుని ఆరాధిస్తే ఎంతో పుణ్యం వస్తుంది.
నదీస్నానం చేస్తే కూడా చాలా పుణ్యం వస్తుంది.
కార్తీక మాసంలో మాంసాహారం తీసుకోకూడదు వీలయినంతవరకు శాకాహారం మాత్రమే తీసుకోవాలి.
సోమవారాలు ఉపవాసం చేయడం కూడా చాలా మంచిది.
కార్తీకమాసంలో బ్రాహ్మణులు ఉల్లిపాయ కి దూరంగా ఉంటారు. వెల్లుల్లిని కూడా వంటల్లో ఉపయోగించరు ఇలా కార్తీక మాసంలో ఈ విధంగా ఆచరిస్తే ఎంతో పుణ్యం వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version