కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు ముఖ్యం…!

-

గురువారం నాడు కేంద్రం కోవిడ్ 19 వాక్సిన్ వేయించుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. భారత దేశం లో ఇప్పుడు వాక్సినేషన్ మూడో ఫేస్ కొనసాగుతోంది. 18 నుంచి 45 ఏళ్ల వాళ్లకి వ్యాక్సిన్ వేస్తున్నారు. గురువారం నాడు 162 మిలియన్ల కంటే ఎక్కువ డోస్ ని తీసుకు రావడం జరిగింది.

కోవిడ్ 19 కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నిజంగా ఇది సునామీలా ఉంది. అయితే కొవిడ్-19 వాక్సిన్ వేయించుకునే ముందు ఏం చెయ్యాలి..?, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..? వంటివి చూద్దాం.

వ్యాక్సిన్ వేయించుకునే ముందు వ్యాక్సిన్ కి సంబంధించి ఎలర్జీ రియాక్షన్స్ ఏమైనా వస్తాయా వంటివి స్పెషలిస్ట్ నుంచి కన్సల్ట్ చేయాలి.

అదే విధంగా ప్రెగ్నెన్సీ వాళ్లు ఇలా ఎవరి సమస్యలు బట్టి వాళ్ళు ముందుగా డాక్టర్ ని వ్యాక్సిన్ గురించి కన్సల్ట్ చేయాలి.

ఇది ఇలా ఉంటే వాక్సిన్ వేయించుకున్న తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే వీటి కారణంగా బాడీకి బెనిఫిట్ అవుతుంది. ఇది ప్రొటెక్షన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.

ఇక సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే… కొద్దిగా జ్వరం, చేతులు నొప్పులు, తల నొప్పి, అలసట, జాయింట్ పెయిన్స్ వంటిది కామన్ గా వస్తూ ఉంటాయి.

కొత్త డోస్ వేయించుకొనేటప్పుడు పాత లక్షణాలని మరియు సమస్యలని ఒకసారి నిపుణులతో చెప్పడం మంచిది. అదే విధంగా ఏమైనా ఇబ్బందికరమైన రియాక్షన్స్ వస్తే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news