అహోబిలంలో ఆ ప్రదేశాలను తప్పక చూడాలి..ఎంత అందంగా ఉన్నాయో..

-

ప్రముఖ క్షేత్రాలలో ఒకటి అహోబిలం..పురాణాల ప్రకారం ఈ దెవాలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్ని సంహరించేందుకు సగం మనిషిగానూ, సగం సింహ రూపంలోనూ అవతరించడంతోనే ఇది మహిమ గల పుణ్యక్షేత్రమని భక్తుల నమ్మకం.. అందుకే నిత్యం భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు..ప్రస్తుతం భారీవర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. పొరుగున ఉన్న కర్నాటక నుంచి కూడా తుంగభద్ర జలాలు ఏపీ వైపు పరుగులు తీస్తున్నాయి. అందుకే అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి కనిపిస్తోంది. ఆలయం ప్రక్కనే తుంగభద్ర జలాల రాకతో జలకళ సంచరించుకుంది..

 

భక్తులతో పాటు పర్యాటకులు అధిక సంఖ్యలో పెన్నా అహోబిలంకు తరలి వస్తున్నారు. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు జలాల సవ్వడి భక్తులను ఆకట్టుకుంటోంది. తుంగభద్ర జలాలు పక్కనే ఉన్న కాల్వ ద్వారా మిడ్ పెన్నార్‌ జలాశయం పోతుడడంతో జలపాతాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. తుంగభద్ర డ్యాం ఇప్పటికే నిండిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది..అనంతపురం జిల్లాకు తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉరవకొండ మండలం మోపిడి లింకు ఛానల్ 189 కిలోమీటర్ వద్ద 450 కుసెక్కుల నీటిని మిడ్ పెన్నార్ జలాశయం మళ్లించారు అధికారులు. దీంతో తుంగభద్ర జలాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కనే పరవళ్లు తొక్కుతూ పరవసిస్తూ ఉంటుంది..

అహోబిలం వద్ద నీటి ప్రవాహం అలలు పచ్చని చెట్లు మధ్య సాగుతోంది. ఆలయం చుట్టూ ఉన్న కోనేరు లోకి, చెట్లు మొదళ్ళు క్రింద జలాలు వస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. తుంగభద్ర జలాలు రాకతో జలకళ సంచరించుకుంది. ఈ ఆహ్లాదకర వాతావరణం భక్తులను బాగా ఆకట్టుకుంటోంది..చరిత్ర ప్రకారం..విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్ని వధించి అతని కుమారుడైన ప్రహ్లాదుడ్ని ఆశీర్వదించాడు. ఈ అహోబలం హిందూ భక్తులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు స్వర్గదామంగా నిలుస్తోంది..

 

ఆ ఆలయంలో ఎన్నో నిధులు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది..శ్రీకృష్ణదేవరాయలు ఈ నిధులను ఆలయంలోని సురక్షిత ప్రాంతంలో దాచి తాను కూడా జీవ సమాధి అయినట్లు భక్తులు, స్థానికులు చెబుతున్న కథనం. అయితే ఈ నిధులను అహోబిల స్వామి క్రూరమృగాలు, పాములు, తేనెటీగల రూపంలో రక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసం..ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే కర్నూలు,నంద్యాల, హైదరాబాద్ నగరాలనుండి బస్సులు లభిస్తాయి. కర్నాటకలోని బళ్ళారి నుంచి భక్తులు తరలి వస్తున్నారు. పెన్నా అహోబిలం రావడానికి ఇటు అనంతపురం నుంచి ఉరవకొండ, బళ్ళారి వెళ్లే బస్ లు, ఉరవకొండ నుంచి 15 నిమిషాలు ఒక బస్ లు నడుస్తుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news