బుల్లితెరపై పలు సీరియల్స్ చూసేవారికి శ్రీవాణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రముఖి సీరియల్ లో తన నటనతో ఒక గుర్తింపు సంపాదించుకున్న ఈమె మనసు మమత , కలవారి కోడలు, కాంచన గంగ, మావిచిగురు, ఘర్షణ , శతమానం భవతి వంటి సీరియల్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తోంది. ఇక కొన్ని టీవీ షోలు యాడ్స్ తో పాటు సినిమాలలో కూడా నటించింది శ్రీవాణి. ముఖ్యంగా నలుగురితో కలిసిపోయి చాలా చక్కగా గలగల మాట్లాడుతూ ఉండే ఈమె అరుదైన వ్యాధి బారిన పడినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చారు.
ఇక శ్రీవాణి భర్త స్వయంగా మాట్లాడుతూ.. మొదట జలుబు అనుకున్నాము.. అందుకు తగ్గట్టుగానే కొన్ని మందులు కూడా వాడాము. ఇక రోజురోజుకు సమస్య విపరీతమైనది .వారం రోజుల నుంచి కంప్లీట్ గా తన వాయిస్ మొత్తం పోయింది. మాట్లాడలేకపోతోంది.. అడిగితే మాట్లాడడానికి కూడా రావడం లేదు అని చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే మాకు చాలా భయంగా ఉంది . కానీ ఏమీ కాదు డెఫినెట్గా మాట వస్తుందని మేము అనుకుంటున్నాము. ఇక తనను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే గట్టిగా అరవడం వల్లే గొంతు లోపలి టిష్యూ వాపుకు గురైందని చెప్పాడు. కొన్ని మందులు ఇచ్చి నెల రోజుల వరకు అసలు మాట్లాడకూడదని చెప్పాడు. ఒకవేళ మాట్లాడితే సమస్య మళ్ళీ విపరీతమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పడంతో ప్రస్తుతం ఆమె కి విశ్రాంతి ఇచ్చాము. త్వరలోనే తాను కోలుకుంటోంది అని నమ్ముతున్నాము అంటూ ఆయన ఆకాంక్షించారు.
ఈ విషయం తెలుసుకున్న పలువురు బుల్లితెర ప్రముఖులు , ఆమె అభిమానులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇకపోతే అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారుతుంది.