ఆధార్ ఇవ్వలేదా..? అయితే ఆ డబ్బులు రావు… జాగ్రత్త..!

-

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. నిజానికి ఇలా డబ్బుల్ని పెట్టడం వలన చాలా లాభాన్ని పొందొచ్చు భవిష్యత్తులో అయ్యే ఖర్చులకి కానీ ఎదురయ్యే ఇబ్బందులకు కానీ అసలు బాధపడక్కర్లేదు. చాలా మంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ సహా చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారా అయితే మీకు ఒక హెచ్చరిక.

సెప్టెంబర్ 30 2023 నాటికి మీ ఆధార్ నెంబర్ ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంది ఒకవేళ కనుక మీరు సబ్మిట్ చేయక పోతే మీ పొదుపు ఖాతా ఫ్రీజ్ అవుతుంది మీ అకౌంట్ ని ఆపేస్తారు. ఆధార్ నెంబర్ అందించే వరకు కూడా మీ ఖాతా లో డబ్బులు నిలిచిపోతాయి దీంతో అందులో జమ చేయడం మెచ్యూరిటీ నగదు తీసుకోవడం అవ్వదు. ఒకవేళ కనుక మీరు గడువు లోపు ఆధార్ నెంబర్ ని ఇవ్వకపోతే మీ ఖాతా ఫ్రీజ్ అయిపోతుంది దాని తర్వాత ఇన్వెస్ట్ చేసే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వడ్డీ జమ అవ్వదు.

అకౌంట్ ఫ్రీజ్ అయిందంటే డబ్బులు జమ చేయడానికి కుదరదు మెచ్యూరిటీ డబ్బులు కూడా ఖాతాలో పడవు. మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి మార్చి 31 2023న నోటిఫికేషన్ ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. చిన్న పొదుపు పథకాలు ఇన్వెస్ట్ చేయాలంటే ఆధార్ తప్పనిసరి కనుక చిన్న మొత్తాల పొదుపు ఖాతాలకి ఆధార్ ని అందించండి సెప్టెంబర్ 30 నాటికి ఆధార్ కార్డు ని సబ్మిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version