కొట్టడానికి నా మాజీ భర్త తన అమ్మను పురమాయించేవాడు.. కరిష్మా కపూర్.!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ తన అందచందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపింది. పలువురు బడా హీరోలతో జతకట్టి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఈమె ఆన్ స్క్రీన్ లో తన నటనతో కట్టిపడేసింది. కానీ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. 2003లో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ను వివాహం చేసుకున్న ఈమె వైవాహిక జీవితం ఎంతో కాలం సవ్యంగా సాగలేదు. తన భర్త ,అత్త వరకట్న వేధింపులకు గురి చేసేవారు అని, తీవ్రస్థాయిలో తనను శారీరకంగా హింసించారు అని వెల్లడించింది.

అంతేకాదు ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో కరిష్మా కూడా తన భర్త, అత్త పై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టిందని సమాచారం. ఇదే విషయంపై కరిష్మా కపూర్ మాట్లాడుతూ.. సంజయ్ తల్లి నాకు ఒక డ్రెస్ బహుమతిగా ఇచ్చింది. కొడుకు కీయాన్ పుట్టిన తర్వాత దాన్ని వేసుకోమన్నారు. తల్లిని అయ్యాక నా శరీరం కొద్దిగా లావు అయింది. ఆ డ్రెస్ నాకు పట్టలేదు.

అది చూసిన సంజయ్ కోపంతో నన్ను లాగి కొట్టమని అతడి తల్లికి చెప్పాడు. అతడి ప్రవర్తనను తప్పుపట్టాల్సింది పోయి ఆమె కూడా కొడుకుకే సపోర్ట్ చేసింది అని.. గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇలా ఎన్నో వివాదాల మధ్య 2016లో సంజయ్ కు విడాకులు ఇచ్చింది. అయితే పిల్లలు సమైరా, కియాన్ రాజ్ కపూర్ బాధ్యతలను తల్లికే అప్పచెబుతూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా దగ్గర జీవితంలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది కరిష్మా.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version