వైరల్ : బిగ్‌బాస్ హౌస్‌లోకి గంగవ్వ ఎంట్రీ..?

-

‘మై విలేజ్ షో’ ఛానల్ ద్వారా యూట్యూబ్ ప్రేక్షకులకు సుపరిచితమైన గంగవ్వ ‘బిగ్‌బాస్’ ఎంట్రీ ఇస్తుందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపారని, మిగితా కంటిస్టెంట్లతో పాటు గంగవ్వను కూడా క్వారంటైన్ పంపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ యాసతో కామెడీ పండించే గంగవ్వకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అలాగే గంగవ్వ చేసే రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఒక వేళ గంగవ్వ గనుక హౌస్‌లోకి వస్తే అది వేరే లెవెల్ అని చెప్పాలి.

అలా సంపాదించిన పేరుతో సినీ స్టార్స్ సమంత, దేవరకొండ, కాజల్ వంటి తారలతో ముచ్చటించింది. అయితే జోరుగా ప్రచారం అవుతున్న గంగవ్వ ‘బిగ్‌బాస్’ ఎంట్రీపై ‘స్టార్ మా’ నుంచి కానీ, గంగవ్వ నుంచి కానీ క్లారిటీ రాలేదు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 4కి సంబంధించిన ప్రోమో వీడియోలు ఇప్పటికే హాల్ చల్ చేస్తున్నాయి. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version