మ్యాట్రిమోని ఖిలాడి కిరణ్ అరెస్ట్…వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మాట్రిమోనీ కిలాడి కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంటరి మహిళలనే టార్గెట్ గా చేసుకుని కిరణ్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఎం టెక్ చదివిన కిరణ్ మ్యాట్రి మోని సైట్ లాలో రకరకాల పేర్లతో అమ్మాయిలను మోసం చేస్తున్నారు. మ్యాట్రిమోనీ లో పరిచయం పేరుతో వారి నుండి డబ్బులు కేటుగాడు దండుకుంటున్నట్టు తెలిసింది. తిరుపతి లో కిరణ్ ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేటుగాడి మాయలో పడి కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన మహిళలు సైతం మోస పోయినట్టు పోలీసులు గుర్తించారు. అనేక ఫిర్యాదుపు అందడం తో కిరణ్ కోసం ముమ్మరంగా పోలీసులు గాలించారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి పరిచయం , ప్రేమ పేరుతో డబ్బులు మోసగాడు డబ్బులు దండుకున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం కిరణ్ ను అదుపులోకి తీసుకుని నాలుగు పోలీస్ బృందాలు విచారిస్తున్నాయి.