THE LOOP : ‘మానాడు’ ట్రైలర్ విడుదల చేసిన నాని

-

తమిళ్‌ స్టార్‌ హీరో శింబు – కళ్యాణి ప్రియ దర్శన్‌ జంటగా వస్తున్న సినిమా ”మానాడు”. క్రియేటివ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వి హౌస్‌ ప్రొడక్షన్స్‌ పతాకం పై నిర్మాత సురేష్‌ కామాచి ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళ, హింది భాషల్లో పాన్‌ ఇండియా మూవీ వస్తోంది.

ఇక ఈ సినిమా లో సుప్ర సిద్ధ దర్శకులు భారతీ రాజా, ఎస్‌ ఏ చంద్ర శేఖర్‌ , ఎస్‌ జె సూర్య ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే… భారీ బడ్జెట్‌ తో తెరక్కుతున్న ”మానాడు” సినిమా నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది.

ఈ సినిమా నుంచి కాసేపటి క్రితమే…ది లూప్‌ పేరుతో ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. టాలీవుడ్‌ నాచురల్‌ హీరో నాని ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ ను విడుదల చేశారు. అలాగే.. తమిళ ట్రైలర్‌ ను మురగదాస్‌, కన్నడ ట్రైలర్‌ ను హీరో రక్షిత్‌ శెట్టి, మలయాళ ట్రైలర్‌ ను నివీన్‌ పౌలీ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ హీరో శించు యాక్టింగ్‌ ఇరగదీశాడు. ఇక ఈ ట్రైలర్‌ ఈ సినిమా అంచనాలు అమాంతం పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news