వింత: ఊరిలో పాము కరిచినా ఏమి కాదు… ఊరు దాటితే అంతే సంగతులు..!

-

పాము కరిస్తే ప్రమాదం అని మనకి తెలుసు. కానీ ఈ ఊరు లో పాము కరిచినా ఏమి కాదుట. ఇక్కడ ప్రజలు, పాములు కలిసి జీవిస్తారు. మరి వివరాల్లోకి వెళితే… కర్ణాటక రాష్ట్రంలో దావణగిరి జిల్లాలో పంచాయత్ పట్టణానికి దగ్గరగా నాగేన హళ్లి అనే గ్రామంలో పాములు మనుష్యులు కలసి ఉంటారట. గుట్టలుగుట్టలుగా పాములు ప్రతీ ఇళ్లల్లో ఉంటాయి. అవి కరిచినా వారికి ఏమీ కాదు. ఇది నిజంగా సైన్స్ కు అందని మిస్టరీగా మిగిలిపోయింది. పాము కరిస్తే గ్రామంలో ఉన్నంత వరకూ వారికి ఏమీ కాదు. కానీ ఆ ఊరుని దాటితే అంతే సంగతులు. అయితే పాము కరవడం చాల అరుదు. ఒకవేళ కనుక కరిస్తే… పాముని తీసుకొని వెళ్ళి ఆ ఊరి స్మశానంలో ఉన్న యతీశ్వర మండపం వద్ద ఉంచుతారు.

అలానే హనుమాన్ ఆలయంలోకి వెళ్ళి తీర్ధం తీసుకుని మర్నాడు ఉదయం వరకూ ఆ గుడిలో నిద్ర పోకుండా అలానే ఉండిపోయి.. ఎక్కిన విషం నిర్వీర్యం అయి క్షేమంగా బయట పడతారు. ఇదే వారి పద్దతి. దీనికి ఒక కధ ఉంది. అదేమిటంటే..? యతీశ్వర స్వామి అనే సాధువు ఇక్కడ ఉండేవాడట. ఇతను బిక్షమ్ ఎత్తుకొని జీవించేవాడు. అప్పుడప్పుడు హనుమాన్ గుడి పరిసరాల్లో విశ్రాంతి తీసుకొంటూ ఉండేవారట. అయితే ఒక రోజు ఆయన బిక్షం ఎత్తుకొని తిరిగి హనుమాన్ గుడికి వస్తుంటే.. పొదల మధ్య ఒక శిశువును చూశారు. ఆ బిడ్డను సాధువు చేరదీశారు. 12 ఏళ్ళు గడిచిన తరువాత… పిల్లవాడిని గుడి దగ్గర విడిచి బిక్షం ఎత్తుకోవడానికి ఊర్లోకి వెళ్లారు.

తిరిగి ఆయన వచ్చే సరికి పాము కాటుకి గురై తన కొడుకు మరణించాడు. దీనితో ఆగ్రహం వచ్చింది. తపస్సంపన్నమైన ఆ సాధువు ఆగ్రహంతో నాగరాజుని శపించడానికి యత్నించాడు. దీనితో నాగరాజు సాధువుని క్షమించమని వేడుకొన్నాడు. ఆ బిడ్డను కూడా బతికించాడు. శాంతించిన సాధువు ఇకపై గ్రామంలో నివశించే వారి మీద, గ్రామంలో ఉన్న వారిపై ఏ విధమైన సర్పం విషం పని చేయదు. గ్రామం దాటితే అది పని చేస్తుంది అన్నాడు. ఇలా నాగేనహళ్లి గ్రామంలో ఉన్నంత వరకు సర్పం తో కరవడిన ఏ వ్యక్తి కీ ప్రాణహాని జరగదు. ఈ గ్రామం లో తోటల్లోనూ, పొదల్లోనూ, తాచుపాములు స్వేచ్ఛగా సంచరిస్తాయి. ఇది నిజంగా సైన్స్ కు అందని మిస్టరీగా మిగిలిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version