Bangarraju : “బంగార్రాజు” సోల్ ఫుల్ మెలోడీ రిలీజ్.. అక్కినేని ఫాన్స్ కు ఇక జాతర షురూ

-

కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన… బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. పంచ కట్టు తో సరసాలు, చిలిపి వేషాలకు బాక్సాఫీస్ మోత మోగింది. బంగార్రాజు గా నాగార్జున చేసిన రచ్చకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమానకు సీక్వెల్‌ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు.

ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే.. ఇవాళ అక్కినేని నాగ చైతన్య బర్త్‌ డే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. “బంగార్రాజు” సినిమాలోని సోల్ ఫుల్ మెలోడీని రిలీజ్ చేశారు. ఈ మెలోడీ సాంగ్ లో చై, కృతి అందరినీ ఆకట్టుకున్నారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది.  ఈ పాటకు అనూప్ రూబెన్స్ ట్యూన్‌ అందించగా.. సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు.

Read more RELATED
Recommended to you

Latest news