తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పై… కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఐటీ మంత్రిగానే పనికొస్తారు అని… మున్సిపల్ మంత్రి గా అసలు పనికిరారని.. పేర్కొన్నారు రవీందర్ సింగ్. సిరిసిల్ల జిల్లాలో దళితులపై దాడులు జరిగితే మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రవీందర్ సింగ్.
రెండు ఎమ్మెల్సీల కోసం ఆరుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు పని చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హుజురాబాద్ నియోజకవర్గ ఫలితమే రిపీట్ కాబోతున్నట్లు తేల్చిచెప్పారు రవీందర్ సింగ్. తన గెలుపును అధికార టీఆర్ఎస్ పార్టీ… అడ్డుకోలేదని తెలిపారు. కాగా.. కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం నుంచి.. రెబెల్ అభ్యర్థిగా రవీందర్ సింగ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా నాయకులను కలుపుకొని రవీందర్ సింగ్ ముందుకు వెళ్తున్నారు.