500కే కరోనా కిట్ తయారు చేసిన విద్యార్ధి…!

-

కరోనా వైరస్ కట్టడి కావాలి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయం వేగంగా టెస్టులు చేయడం. ఎంత వేగంగా టెస్టులు నిర్వహిస్తే అంత వేగంగా కరోనా వైరస్ అనేది కట్టడి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపధ్యంలో టెస్ట్ కిట్స్ తయారిని దేశ వ్యాప్తంగా వేగవంతం చేసింది. తాజాగా ఒక విద్యార్ధి కరోనా టెస్ట్ కిట్ ని తక్కువ ధరకు తయారు చేసారు. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థి నదీమ్‌ రెహ్మాన్‌ స్వదేశీ పరిజ్ఞానంతో…

యాంటీ బాడీ కరోనా వైరస్‌ టెస్టింగ్‌ కిట్‌ ని అభివృద్ధి చేసాడు. ఈ కిట్ తో కేవలం 15 నిమిషాల్లోనే కరోనా పరిక్ష చేయవచ్చు. ఈ కిట్‌ ధర 500 నుంచి 600 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా ఉత్పత్తి చేస్తే ధర మరింతగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఫింగర్‌ ఫ్రీక్‌ విధానంలో ఈ కిట్‌ ద్వారా కరోనా పరీక్షలు చేస్తారు వైద్యులు. ఆర్‌టీ – పీసీఆర్‌ కంటే ఇవి చాలా తక్కువ ధర.

ప్రస్తుతం పరీక్షలు నిర్ధారణలో పాథాలజీ విభాగంపై విపరీతమైన ఒత్తిడి ఉంటుందని… దానిపై ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఈ కిట్లు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ దీనికి ఆమోదం తెలిపింది. వీటిని త్వరలోనే ప్రారంభించి సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version