స్టైలిష్ లుక్ లో మైమరిపిస్తున్న నదియా..!!

-

అత్తారింటికి దారేది సినిమా ద్వారా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలుపెట్టింది అలనాటి హీరోయిన్ నదియా. తెరపైన ఇంత సీరియస్ గా కనిపించే నదియా రియల్ లైఫ్ లో కూడా చాలా కూల్ గా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో కూడా ప్రభాస్కు తల్లిగా నటించి మరింత ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక ఆ తర్వాత దృశ్యం, బ్రూస్లీ ,సర్కారు వారి పాట తదితర చిత్రాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది నటి నదియా.

అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నదియా కూడా ఒకప్పుడు సినిమాలలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది. అయితే సినిమాలలో ఉండగానే 1988లో అమెరికాకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి యుఎస్ లో వెళ్లి అక్కడే సెటిల్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ దంపతులకు సనమ్ అనే కుమార్తె కూడా పుట్టింది. ఆ తరువాత 2001లో వీరికి జానా అనే అమ్మాయి కూడా జన్మించింది.

ఇక తర్వాత మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చేసిన నదియా తన కుటుంబంతో కలిసి చెన్నైలో స్థిరపడినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండని నదియా కానీ అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి పలు విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా స్టైలిష్ లుక్ లో ఉన్న ఈమె ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది ..బ్లూ జీన్స్, బ్లూ కలర్ టి షర్టులో మోడల్ అత్తగా కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version