‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌పై క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

-

మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ . సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాని మే 9 న 2024లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా టైటిల్‌పై ఇంట్రెస్టింగ్ విశేషాలు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ పంచుకున్నాడు.

తాజాగా ఈ సినిమా టైటిల్ ‘కల్కి 2898 ఏడీ’ అని పెట్టడానికి గల కారణాన్ని నాగ్ అశ్విన్ వెల్ల‌డించారు. ఈ సినిమా మహాభారతం కాలం నుంచి ప్రారంభ‌మై 2898 సంవ‌త్స‌రంతో పూర్తవుతుంది. గ‌తంతో మొదలై ఫ్యూచ‌ర్‌తో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం అని తెలిపారు.ఈ మూవీలో మొత్తం 6000 సంవత్సరాల మ‌ధ్య జ‌రిగే కథను చూపించబోతున్నాం. దానికి త‌గ్గ‌ట్లు ఓ స‌రికొత్త‌ ప్రపంచాన్ని సృష్టించాం అని నాగ్ అశ్విన్ వెల్ల‌డించాడు. ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news