చైతు ఖాతాలో మరో హిట్‌.. అదిరిపోయిన ‘థ్యాంక్యూ’ టీజర్‌

-

వరుస హిట్లతో జోరుమీదున్న నాగ చైతన్య ఖాతాలో మరో హిట్‌ పడనున్నట్లు కనిపిస్తోంది. లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్లు కొట్టిన చైతు ఇప్పుడు ‘థ్యాంక్యూ’ సినిమాతో హ్యట్రిక్ హిట్‌ కొట్టేటట్లు టీజర్‌ చూస్తుంటే అనిపిస్తోంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ కథలో చైతూ జర్నీని చూపించారు. టీనేజ్ లోను .. ఆ తరువాత .. విదేశాలకి వెళ్లిన తరువాత ఆయనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ కథ నడవనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ తో ఆయన ప్రయాణం కొనసాగుతుందనే విషయాన్ని చూపించారు. ఆ జాబితాలో రాశి ఖన్నా .. అవికా .. మాళవిక నాయర్ కనిపిస్తున్నారు

‘లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు .. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను’ అనే చైతూ డైలాగ్ ను బట్టి చూస్తే, సీరియస్ గా ఆయనకి ఏదో గోల్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ .. యాక్షన్ కి సంబంధించిన సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, జూలై 8వ తేదీన విడుదల చేయనున్నారు చిత్రయూనిట్‌.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version