ప్రాస్టిట్యూట్ పాత్రకు ఓకే చెప్పిన సమంత, చైతు రియాక్షన్ ఏంటి…?

-

సాధారణంగా పెళ్లి తర్వాత సినిమాలు చెయ్యాలంటే హీరోయిన్లు కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. అత్తారింటిలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోలేక దాదాపు సినిమాలకు దూరం జరుగుతారు హీరోయిన్లు. పెళ్లి తర్వాత కనుమరుగైపోయిన చాలా మంది హీరోయిన్లను మనం చూసాం. కెరీర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం సినిమాలను ప్రేమిస్తూ అమ్మా నాన్నలను కూడా కాదని సినిమాలు చేస్తూ పోతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావిస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే అక్కినేని వారి పెద్ద కోడలు సమంతా మాత్రం అందుకు భిన్నం.

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ తన స్టార్ ఇమేజ్ ని కాపాడుకుంటుంది. పెళ్ళికి ముందు కంటే పెళ్లి తర్వాతే ఆమె మంచి పాత్రల్లో నటించింది అనేది వాస్తవం. భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తూ నటనను కూడా బయటపెడుతూ వచ్చింది. దీనితో కొన్ని పాత్రలకు సమంత అయితేనే బాగుంటుందనే అభిప్రాయానికి దర్శకులు వచ్చారు. ప్రస్తుతం ఆమె 96 రీమేక్ లో నటిస్తుంది. ఈ సినిమా పూర్తి కాకుండానే ఒక సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్కడో నెల్లూరు నుంచి పొట్టకూటి కోసం వచ్చిన 26 ఏళ్ళ అమ్మాయి, వ్యభిచారిగా ఏ విధంగా మారింది అనే కథలో సమంత నటించడానికి ఒప్పుకుంది.

వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని కూడా సమాచారం. ఈ నేపధ్యంలో దీనికి ఆమె భర్త నాగ చైతన్య అడ్డుకట్ట వేసినట్టు తెలుస్తుంది. లేడీ ఓరియంటెడ్ పాత్రలకు ఓకే గాని, అలాంటి పాత్రల్లో వద్దని, నీకో స్టార్ ఇమేజ్ ఉందని, మాస్ లో ఫాలోయింగ్ ఉంది కాబట్టి అలాంటి పాత్రలు చేస్తే చులకన అవుతావని, పెళ్ళికి ముందు అయితే పర్వాలేదు గాని ఇప్పుడు వద్దని చెప్పేశాడట. దీనితో సమంత ఆ సినిమా నుంచి డ్రాప్ అయినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news