Varudu Kaavalenu: యంగ్ హీరో నాగ శౌర్య.. విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘లక్ష్య’, ‘వరుడు కావలెను’ తదితర సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల నుంచి రిలీజ్ అయిన టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ‘వరుడు కావలెను’ సినిమాను దసరా కానుకగా.. అక్టోబర్ 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్లను కూడా వదిలారు. కానీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం.. దసరా బరిలోంచి ఈ మూవీ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి లక్ష్మి సౌభాగ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన రీతు వర్మ నటిస్తున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, తదితరులు కీలక పాత్రలు పోషించారు.
పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. దసరా బరిలో ఇప్పటికే.. మహాసముద్రం, అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`, యంగ్ హీరో రోషన్ `పెళ్లి సందD` చిత్రాలు బరిలో ఉన్నాయి. అక్టోబర్ 14వ తేదీన `మహా సముద్రం` విడుదల కాగా, అక్టోబర్ 15 న `వరుడు కావలెను` తోపాటు మహాసముద్రం, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` విడుదల కానున్నాయి.
దీంతో శౌర్యనే ఓ మెట్టు వెనక్కి తగ్గి.. నవంబర్ మొదటివారంలో విడుదల చేయాలనుకుంటారంటా.. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాలి. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.