ప్రకాశ్ రాజ్ కు టైం సెన్స్‌ లేదు.. విష్ణుకే ఓటు వేయండి : కోటా శ్రీనివాసరావు

మా అసోషియేషన్‌ ఎన్నికలు మరో రెండు ఉన్న నేపథ్యం లో టాలీవుడ్‌ ప్రముఖులు అందరూ తమ మద్దతు ఏ ప్యానెల్‌ కు ఇస్తున్నామో వరుసగా చెబుతున్నారు. ఇక తాజాగా టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కోట శ్రీనివాస రావు.. మా అసోషియేషన్‌ ఎన్నికలపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. మా అసోషియేషన్‌ ఎన్నికల్లో మంచు విష్ణు కి ఓటు వేయాలని నటుడు కోట శ్రీనివాస రావు తెలిపారు.

మా అధ్యక్షుడిగా అన్ని విధాలుగా అర్హత కలిగిన వ్యక్తి మంచు విష్ణు అని కొనియాడారు. నటుడు ప్రకాష్ రాజ్ తో తనతో 15 సినిమా లు చేశాడని…ఇప్పటి వరకు ఎప్పుడూ టైం కూడా షూటింగ్లకు రాలేదని ఫైర్‌ అయ్యారు. కాబట్టి మా అసోషియేషన్‌ సభ్యులంతా ఆలోచించి ఓటు వేయాలని కోరారు కోట శ్రీనివాస రావు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా మంచు విష్ణు ను గెలిపించాలని వెల్లడించారు కోట శ్రీనివాస రావు. కాగా.. మా అసోషియేషన్‌ ఎన్నికల్లో ఈ నెల 10 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే.