ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ.. ఒకరి జీవితాన్ని కాపాడడం కన్నా సంతృప్తినిచ్చే విషయం ఏముంటుందని అన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన తమ్ముడు నాగబాబు కూడా తన ట్విట్టర్ వేదికగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ తాను రక్తదానం చేశానని చెప్తూ.. దానికి సంబంధించిన ఫోటోలను పెట్టారు.
అలాగే రక్తదానం చేయాలని తాను అందరినీ కోరుతున్నట్లు నాగబాబు పేర్కొన్నారు. ఇతరుల జీవితాలను కాపాడానికి రక్తదానం చేయాలని ఆయన కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రక్తదానం చేయడమే అత్యధిక ప్రాధాన్యతతో కూడుకున్న బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రక్తదానం చేసేవారు తగ్గిపోయారని ఆయన గుర్తు చేశారు. రక్తానికి ప్రత్యామ్నాయం మరేదీ లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నానని తెలిపారు.
“Donate your blood for a reason, let the reason be life”
Donating blood amidst Covid-19 is our highest responsibility… The donation has reduced due to the pandemic but the requirement for blood remains the same.
Remember there's no substitute for Blood! pic.twitter.com/5DRjGAXeIa— Naga Babu Konidela (@NagaBabuOffl) June 14, 2020