సరూర్ నగర్ లో హత్య కాబడ్డ నాగరాజు కేసుపై మాజీ మంత్రి చంద్ర శేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనపై మంత్రులు ఎవ్వరు స్పందించడం లేదు.. ఒక చిన్న ఫోన్ తోనే ఎస్సి కమిషన్ స్పందించిందని పేర్కొన్నారు. బాధిత అమ్మాయికి ప్రభుత్వం ఆదుకోవాలి.. నిందుతులని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఒకరు ఎంఐఎం, ఒకరు టీఆరెస్ వ్యక్తి కూడా ఈ మర్డర్ లో ఉన్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.. అమ్మాయికి రక్షణ కల్పించాలి.. గవర్నర్ చర్యలు తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. మతపరమైన చర్యలను ఆపాలి.. నిందితులకు ఉరి శిక్షవేయాలని డిమాండ్ చేశారు. నాగరాజు హత్య జరిగి ఐదు రోజులు గడిచిన ప్రభుత్వం స్పందించలేదు..ముఖ్యమంత్రి, హోమ్ మినిష్టర్ నుంచి కనీస స్పందనలేదు.. రాష్ట్ర వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు చేసి చంపుతున్నారు.. బీజేపీ పార్టు బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు మాజీ మంత్రి చంద్ర శేఖర్.