సంస్కారానికి ప్రతిరూపం నా అన్న కొడుకు..చరణ్ పై నాగ్..!

టాలీవుడ్ అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కు ముఖ్య అతిథిగా వచ్చి హీరో రామ్ చరణ్ అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. రామ్ చరణ్ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డారు. ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు చరణ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో లోనే బిగ్ బాస్ కు వచ్చి సందడి చేశారు. ఇక బిగ్ బాస్ లో చరణ్ నాగ్ తో కలిసి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తండ్రి చిరు మరియు నాగార్జున ఫిట్నెస్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అని చరణ్ చెప్పారు.

ఇద్దరికీ ఒకే జిమ్ ట్రైనర్ అని అతడి పేరు అర్జున్ అని చరణ్ తెలిపారు. నాగార్జున కరోనా టైం లోనూ జిమ్ చేశారని కానీ తాను చేయలేకపోయానని అందుకే తన షేప్ పోయిందన్నారు. ఇక రామ్ చరణ్ తనకు ఒక ఈవెంట్ కు వెళ్ళినప్పుడు ప్లేట్ లో భోజనం పెట్టి ఇచ్చారని సన్నీ చెప్పగా…నాగ్ ఎవరనుకున్నావు మా అన్న కొడుడు చరణ్ సంస్కారానికి ప్రతిరూపం అంటూ చెప్పాడు. ఇక చరణ్ షో లో ఒక్కో సభ్యుడిని పలకరించి మాట్లాడాడు. ఆ తరవాత మేస్ట్రో చిత్ర యూనిట్ కూడా బిగ్ బాస్ కు వచ్చి సందడి చేసింది.