టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సిఎం జగన్‌పై చేసిన విమర్శలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అయ్యాయి. మామూలుగానే అయ్యన్న కాస్త దూకుడుగా మాట్లాడుతుంటారు…తాజాగా మాత్రం అయ్యన్న…తన స్థాయి మరిచి జగన్‌ని తిట్టారు. అలాగే హోమ్ మంత్రి, పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు కూడా భగ్గుమంటున్నాయి.స తమ సిఎంపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలని వైసీపీ నేతలు ఖండిస్తూ, తీవ్ర స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు.
అయితే ఇక్కడ వైసీపీ నేతలు బూతులు మాట్లాడకుండా ఉంటారు…వారు కూడా అలాగే చంద్రబాబుని విమర్శిస్తున్నారు. కానీ అయ్యన్న…జగన్‌ని తిట్టడాన్ని మాత్రం సహించలేకపోతున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ నేతలు ఓ రేంజ్‌లో హడావిడి చేసేస్తున్నారని టిడిపి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. జోగి రమేష్‌కు చంద్రబాబు ఇంటికెళ్ళి గొడవ చేయడానికి ఏం పని అంటున్నారు. అయితే టిడిపి నేతలు ఏదైనా నిరసన తెలియజేయడానికి కోవిడ్ రూల్స్ అని ఆంక్షలు పెడతారని, కానీ వైసీపీ నేతలు గొడవలు చేయడానికి ఎలా పర్మిషన్ ఇస్తున్నారని పోలీసులని ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో కొందరు టిడిపి కార్యకర్తలు అయ్యన్నపై కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడుప్పుడే టిడిపి పికప్ అవుతుందనుకుంటే, అనవసరంగా అయ్యన్న నోరు జారి…కొంపముంచారని కొందరు తమ్ముళ్ళు బాగా ఫీల్ అయిపోతున్నారు. వైసీపీ నేతలు బూతులు మాట్లాడితే, మన నేతలు కూడా మాట్లాడాలని రూల్ లేదని, కొంచెం తగ్గి ఉంటే సానుభూతి వచ్చి పార్టీకే ప్లస్ అయ్యేదని, కానీ అయ్యన్న దెబ్బకు మొత్తం రాజకీయం మారిపోయిందని తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు.
దీనికి తోడు అయ్యన్న అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. మామూలుగానే వైసీపీ, టిడిపి నేతలని వరుసపెట్టి జైలుకు పంపుతుందని, ఇప్పుడు అనవసరంగా అయ్యన్న కెలుక్కుని మరీ జైలుకు వెళ్ళేలా ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే భారీగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న వైసీపీ… అయ్యన్నని నెక్స్ట్ ఎత్తేసి జైల్లో వేయడమే మిగిలిందని చెబుతున్నారు.