కొవిడ్ టైమ్‌లో నాగార్జున రిస్క్‌… ఆ సినిమా కోసం ఏకంగా!

-

ప్ర‌స్తుతం క‌రోనా దెబ్బ‌కు తెలుగు ఇండస్ట్రీ నిలిచిపోయిద‌నే చెప్పాలి. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే తేడా లేకుండా అన్ని షూటింగులు ఆగిపోయాయి. ఇప్పుడు సెకండ్‌వేవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతోంది. ఇలాంటి టైమ్‌లో షూటింగ్ చ‌య‌డానికే అంద‌రూ బ‌య‌ప‌డుతున్నారు. కానీ నాగార్జున మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాడు.

త‌న వ‌య‌సును కూడా లెక్క చేయ‌కుండా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మొన్న వైల్డ్ డాగ్‌తో వ‌చ్చినా ఈ సీనియ‌ర్ హీరో.. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారంట‌.

ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ పూర్తి చేశారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం జూన్ రెండో వారంలో ఫారెన్ వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నాగార్జున. అక్క‌డ కేసులు త‌క్కువ‌గా ఉండ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఎంతైనా నాగార్జున రిస్క్ తీసుకుంటున్నాడ‌ని చెప్పాలి. మ‌రి మిగ‌తా హీరోలు కూడా ఇలాగే చేస్తారా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news